Junior NTR: ఈ భువిలో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే: జూనియర్ ఎన్టీఆర్

Junior NTR pays tributes to SP Balu
  • బాలు మృతిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన తారక్
  • తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయిందని వ్యాఖ్య
  • భారతీయ సంగీతం ముద్దు బిడ్డను కోల్పోయిందని ఆవేదన
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తుదిశ్వాస విడిచారన్న వార్తతో సినీ పరిశ్రమ మూగబోయింది. సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఆవేదన వ్యక్తం చేశాడు. 'తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ , పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రంగా కలచివేసింది. ఈ భువిలో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే' అని ట్వీట్ చేశారు.
Junior NTR
SP Balasubrahmanyam
Tollywood

More Telugu News