Sherlyn Chopra: ఐపీఎల్‌ పార్టీల్లో డ్రగ్స్ వాడతారు.. నేను ప్రత్యక్షంగా చూశాను: షెర్లిన్ చోప్రా

There is drugs culture in IPL parties sasy Sherlyn Chopra
  • గతంలో నేను ఒక పార్టీకి వెళ్లాను
  • ఆ పార్టీకి క్రికెటర్లు, వారి భార్యలు వచ్చారు
  • క్రికెటర్ల భార్యలు కొకైన్ మత్తులో ఉండటాన్ని నేను చూశాను
సినీ పరిశ్రమను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో డ్రగ్స్ కల్చర్ పై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా హీరోయిన్ షెర్లన్ చోప్రా మరో సంచలన విషయాన్ని వెల్లడించింది. క్రికెట్ ప్రపంచంలో డ్రగ్స్ కల్చర్ ఉందని తెలిపింది. ఐపీఎల్ మ్యాచ్ ల తర్వాత జరిగే పార్టీల్లో డ్రగ్స్ వాడతారని... ఈ విషయాన్ని తాను ఒకసారి ప్రత్యక్షంగా చూశానని చెప్పారు.

ఓ మీడియా సంస్థతో షెర్లిన్ మాట్లాడుతూ... గతంలో కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన పార్టీకి తాను హాజరయ్యానని చెప్పింది. ఆ పార్టీకి క్రికెటర్లతో పాటు వారి భార్యలు కూడా వచ్చారని తెలిపింది. పార్టీలో బాగా డ్యాన్స్ చేసి తాను అలసిపోయానని... ఆ తర్వాత వాష్ రూమ్ కు వెళ్లిన తాను అక్కడి పరిస్థితి చూసి షాక్ కు గురయ్యానని... వాష్ రూమ్ లో క్రికెటర్ల భార్యలు కొకైన్ మత్తులో ఉన్నారని చెప్పింది.

వారు తనను చూసి నవ్వగా... తాను కూడా నవ్వానని చెప్పింది. ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చానని తెలిపింది. పురుషుల వాష్ రూమ్ లో కూడా అలాంటి దృశ్యాలే కనిపిస్తాయని  చెప్పింది. ఇలాంటి డ్రగ్స్ పార్టీలు జరుగుతూనే ఉంటాయని తెలిపింది. షెర్లిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
Sherlyn Chopra
Bollywood
IPL
Parties
Drugs

More Telugu News