Disha: 'దిశ ఎన్‌కౌంటర్‌' ట్రైలర్‌ విడుదలకు సిద్ధమైన వర్మ.. మరో పోస్టర్ విడుదల

disha trailer to be released tomorrow
  • 'దిశ.. ఎన్‌కౌంటర్‌'‌ నుంచి రేపు ట్రైలర్ విడుదల
  • నట్టి కరుణ సమర్పణలో సినిమా
  • దర్శకత్వం వహిస్తోన్న ఆనంద్‌ చంద్ర  
గత ఏడాది సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్‌ దిశ హత్యాచారం కేసులో నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన విషయం తెలిసిందే. శంషాబాద్ సమీపంలోని చటాన్ పల్లి దగ్గర నలుగురు నిందితులు పోలీసుల కాల్పులలో మరణించిన ఘటన ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న సినిమా 'దిశ.. ఎన్‌కౌంటర్‌'‌ నుంచి రేపు ట్రైలర్ విడుదల కానుంది.

ఈ విషయాన్ని ప్రకటిస్తూ రామ్ గోపాల్ వర్మ మరో పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ను రేపు ఉదయం 9.08 గంటలకు విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, 'దిశ' ఘటన జరిగిన నవంబర్‌ 26 తేదీనే ఈ సినిమాను విడుదల చేస్తానని వర్మ తెలిపారు.
Disha
RGV
Tollywood

More Telugu News