Somu Veerraju: బాలు మన మధ్యకు తిరిగి రావాలి: సోము వీర్రాజు

Somu Veerraju tweets on SP Balu
  • విషమించిన ఎస్పీ బాలు ఆరోగ్యం
  • ఆందోళనకు గురవుతున్న అభిమానులు
  • బాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వీర్రాజు
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమించిందనే వార్తతో అందరూ ఆందోళనకు గురవుతున్నారు. చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో బాలు వెంటిలేటర్ పై ఉన్నారు. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని... త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి ఆయన విడుదలవుతారనే వార్తలతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్న వేళ... ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందనే వార్తతో మళ్లీ ఆందోళనకు గురవుతున్నారు. ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

బాలు త్వరగా కోలుకోవాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆకాంక్షించారు. తన గానామృతంతో సంగీత ప్రియులను అలరించాలని, ఆయురారోగ్యాలతో మన మధ్యకు తిరిగి రావాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.
Somu Veerraju
BJP
SP Balasubrahmanyam
Tollywood

More Telugu News