Donald Trump: బైడెన్‌కు అంత ఈజీగా అధికారాన్ని ఇవ్వను: డొనాల్డ్ ట్రంప్

Donald trump says he will not give power to joe biden easily if he lost in elections
  • మెయిల్ ఇన్ ఓటింగ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ట్రంప్
  • ఎన్నికల్లో ఓడినా ఫలితం మాత్రం కోర్టులోనే తేలుతుందంటూ వ్యాఖ్యలు
  • ట్రంప్ వైపే భారతీయ అమెరికన్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడినప్పటికీ అంత త్వరగా బైడెన్‌కు అధికారం అప్పగించబోనని స్పష్టం చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి మెయిల్ ఇన్ ఓటింగ్‌ను అనుమతించాలని చాలా రాష్ట్రాలు భావిస్తుండగా, ట్రంప్ మాత్రం ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో తాను ఓటమి పాలైనప్పటికీ, ఫలితం మాత్రం కోర్టు ద్వారానే తేలుతుందన్నారు.

మరోవైపు, ట్రంప్‌పై భారతీయ అమెరికన్లలో సానుకూల దృక్పథం పెరగడంతో వారు ఆయనవైపే ఉన్నారని ఇటీవల ఓ సర్వే వెల్లడించింది. భారత ప్రధాని నరేంద్రమోదీతో ట్రంప్‌కు ఉన్న స్నేహబంధంతోపాటు చైనా విషయంలో ట్రంప్ కఠినంగా ఉండడం ఇందుకు మరో కారణమని సర్వే పేర్కొంది.
Donald Trump
America
Joe biden
Indian americans

More Telugu News