రేపు రకుల్ ప్రీత్ ను విచారించనున్న ఎన్సీబీ అధికారులు

24-09-2020 Thu 19:57
NCB officials to question Rakul Preet tomorrow
  • మలుపులు తిరుగుతున్న డ్రగ్స్ వ్యవహారం
  • స్టార్ హీరోయిన్లకు ఎన్సీబీ నోటీసులు
  • రేపు విచారణ

టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు రేపు విచారించనున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానంతరం చోటుచేసుకున్న పరిణామాలతో డ్రగ్స్ కోణం వెల్లడైంది. సుశాంత్ గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని ప్రశ్నించగా, ఆమె పలువురు తారల పేర్లు బయటపెట్టింది.

ఈ క్రమంలోనే ఎన్సీబీ అధికారులు దీపిక పదుకొణే, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ లకు సమన్లు పంపారు. దీనిపై ఎన్సీబీ స్పందిస్తూ, రకుల్ ప్రీత్ సింగ్ రేపు విచారణకు హాజరవుతున్నారని వెల్లడించింది. రకుల్ తో సహా, దీపికా పదుకొణే, కరిష్మా ప్రకాశ్ కూడా విచారణకు వస్తున్నారని వివరించింది.