ఐపీఎల్ 2020: పంజాబ్ తో మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్

24-09-2020 Thu 19:14
RCB won the toss against Kings Eleven Punjab
  • ఐపీఎల్ లో నేడు పంజాబ్ వర్సెస్ బెంగళూరు
  • ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీ
  • మరో విజయం కోసం చాలెంజర్స్ తహతహ

ఐపీఎల్ లో మరో ఆసక్తికర పోరుకు సర్వం సిద్ధమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఓ మ్యాచ్ గెలిచిన బెంగళూరు జట్టులో ఉత్సాహం ఉరకలేస్తోంది. తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై రాయల్ చాలెంజర్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పంజాబ్ తో మ్యాచ్ లోనూ అదే ఊపు కనబర్చాలని భావిస్తోంది.

తుది జట్ల వివరాలు...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, నికోలస్ పూరన్, గ్లెన్ మ్యాక్స్ వెల్, సర్ఫ్రాజ్ ఖాన్, జిమ్మీ నీషామ్, మహ్మద్ షమీ, మురుగన్ అశ్విన్, షెల్డన్ కాట్రెల్, రవి బిష్ణోయ్.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, ఏబీ డివిలియర్స్, శివం దూబే, జోష్ ఫిలిప్పే (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, ఉమేశ్ యాదవ్, డేల్ స్టెయిన్, యజువేంద్ర చహల్.