ఏపీ కరోనా అప్ డేట్స్: 52 మరణాలు, 7,855 పాజిటివ్ కేసులు

24-09-2020 Thu 18:40
Corona severeness declines gradually in Andhra Pradesh
  • ఏపీలో కరోనా తీవ్రత తగ్గుముఖం!
  • తాజాగా 8,807 మందికి కరోనా నయం
  • ఇంకా 69,353 మందికి చికిత్స

ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా 76,000 కరోనా పరీక్షలు చేపట్టగా 7,855 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో మరోసారి అత్యధిక కేసులు వచ్చాయి. ఈ జిల్లాలో 1,095 కొత్త కేసులు వెల్లడయ్యాయి. మొత్తమ్మీద ఏపీలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,54,385కి చేరింది.

కాగా, రాష్ట్రంలో మరో 51 మరణాలు సంభవించగా, మొత్తం మృతుల సంఖ్య 5,558కి పెరిగింది. ఇక, గడచిన 24 గంటల్లో 8,807 మందికి కరోనా నయం అయింది. దాంతో ఇప్పటివరకు మొత్తం 5,79,474 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 69,353 మంది చికిత్స పొందుతున్నారు.