Sabitha: 2017కి ముందు పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలి: సబిత

  • తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోలాహలం
  • ఓటర్ల నమోదుకు అక్టోబరు 1న నామినేషన్
  • ఉత్సాహంగా ఓటర్ల నమోదు నిర్వహించాలన్న మంత్రి సబిత
Sabitha speech over Graduate MLC voters registration

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనుంది. ఈ లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. కొత్త ఓటర్ల నమోదు కోసం అక్టోబరు 1న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఓటర్ల నమోదుకు నవంబరు 6 తుది గడువు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లా తాండూరులో మాట్లాడుతూ, పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఉత్సాహవంతంగా నిర్వహించాలని కోఆర్డినేటర్లకు పిలుపునిచ్చారు. 2017కి ముందు డిగ్రీ పూర్తయిన ప్రతిఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఏ డిగ్రీ పాసైన వారైనా ఓటరుగా నమోదుకు అర్హులని స్పష్టం చేశారు.

తాండూరు నియోజకవర్గంలో గత ఎన్నికల సమయంలో 3,344 మంది పట్టభద్రులు మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నారని, ప్రస్తుతం నిర్వహించే ఓటర్ల నమోదులో ఈ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలవాలని అన్నారు.

More Telugu News