వైఎస్ భారతి తండ్రి గంగిరెడ్డికి అనారోగ్యం.... తిరుపతి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లిన సీఎం జగన్
- ఈ ఉదయం తిరుమలలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం
- గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రిలో గంగిరెడ్డికి చికిత్స
- ఆసుపత్రిలో మామను పరామర్శించిన జగన్
కొద్దిసేపటి కిందటే ఆయన గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ తన మామ గంగిరెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా ఈ ఉదయం సీఎం జగన్ తిరుమలలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతో కలిసి కర్ణాటక అతిథి గృహం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.