అహంకారంతో దూషిస్తున్న కొడాలి నాని 'కలియుగ శిశుపాలుడు': జీవీఎల్

24-09-2020 Thu 13:28
GVL slams AP Minister Kodali Nani over his remarks on Declaration
  • తన వ్యాఖ్యలతో విమర్శలపాలవుతున్న కొడాలి నాని
  • మోదీ, యోగిని కూడా దూషిస్తున్నాడన్న జీవీఎల్
  • వందసార్లు మోదీని దూషించేదాకా ఆగుతారా? అంటూ ట్వీట్

ఏపీ మంత్రి కొడాలి నాని ఆలయాలపై దాడులు, తిరుమల డిక్లరేషన్ అంశంపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తాజాగా స్పందించారు. అహంకారంతో దేవుళ్లను దూషిస్తున్నాడని, అంతేకాకుండా అత్యంత పవిత్ర హిందువులైన ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగిని కూడా దూషిస్తున్నాడని ఆరోపించారు.

ఈ మేరకు కొడాలి నానిని కలియుగ శిశుపాలుడు అంటూ ఆయన అభివర్ణించారు. వందసార్లు మోదీని దూషించే దాకా ఆగి చంద్రబాబులా తమ పతనాన్ని కోరి తెచ్చుకుంటారో, లేక తమ తప్పును గుర్తించి కొడాలి నానిని వెంటనే తొలగిస్తారో చూడాల్సి ఉందంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి జీవీఎల్ వ్యాఖ్యానించారు.