కొడాలి నాని మాటలు హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయి: విష్ణుకుమార్ రాజు

24-09-2020 Thu 13:13
vishnu kumar raju slams kodali nani
  • హిందూ ఆలయాలపై దాడులపై బీజేపీ నిరసనలు
  • ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్న విష్ణుకుమార్ రాజు 
  • నానిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కొడాలి నాని మాటలు హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని అన్నారు. ఆలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. నానిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా, కడప జిల్లాలో బీజేపీ నిర్వహించిన ధర్నాలో బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు ఆది నారాయణ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతిలో నిర్వహించిన ధర్నాలో భానుప్రకాశ్ రెడ్డి, సోమంచి శ్రీనివాస్ పాల్గొన్నారు.  నానిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. విజయవాడలోనూ బీజేపీ నేతలు ధర్నాలు నిర్వహించారు. విజయవాడలో బీజేపీ నేతల అరెస్టుతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. కలెక్టరేట్లు ఆర్డీవో కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. హిందూ సమాజాన్ని కొడాలి నాని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.