China: భారత్ దెబ్బకు.. తూర్పు లడఖ్‌ లో డ్యూటీ అంటే భయంతో ఏడ్చేస్తున్న చైనా సైనికులు.. వీడియో ఇదిగో!

  • వివరాలు తెలిపిన తైవాన్ మీడియా 
  • ఈ నెల 15న చైనా సైన్యంలో కొత్తగా చేరిన యువత
  • తమ సైనిక గీతం పాడుతూ భయంతో ఏడుపు
PLA recruits seen sobbing en route to Ladakh border

సరిహద్దుల వద్ద భారత్‌, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. చైనా చర్యలకు భారత్‌ దీటుగా సమాధానం ఇస్తోంది. ఈ నేపథ్యంలో చైనా సైనికులు భయపడిపోతున్నట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో విధులకు వెళ్లే చైనా సైనికులు భయపడుతున్నారని తైవాన్ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. సరిహద్దుల్లో విధులకు వెళ్తే అక్కడ నుంచి తిరిగి ఇంటికివెళ్తామా? అన్న ఆందోళన వారిలో నెలకొందని పేర్కొంది.

వారు పిరికితనంతో ఎలా వ్యవహరిస్తున్నారో తెలిపేలా ఓ వీడియో బయటకు వచ్చింది.  ఈ వీడియోను పాకిస్థాన్ హాస్యనటుడు జమీద్ హమీద్ కూడా ఇటీవలే పోస్ట్ చేశారు. ఈ నెల 15న హుబే ప్రావిన్సులో సైన్యంలో కొత్తగా చేరిన చైనా యువతకు తూర్పు లడఖ్‌‌ సరిహద్దుల వద్ద పోస్టింగ్ ఇచ్చారు. దీంతో వారు బస్సులో వెళ్తూ తమ సైనిక గీతం పాడుతూ ఏడ్చారు. ఈ వీడియోను ఒకరు తీసి పోస్ట్ చేశారు. ఇదే వీడియోను తైవాన్‌ మీడియా కూడా ప్రసారం చేస్తోంది. తూర్పు లడఖ్‌లో భారత సైనికులను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో వారు ఏడ్చారని తెలిపింది.

More Telugu News