తమిళ సినీ హీరో విజయకాంత్ కు సోకిన కరోనా!

24-09-2020 Thu 09:48
Corona attacked to Tamil Hero Vijaykant
  • కొంతకాలంగా విజయకాంత్ కు అస్వస్థత
  • పరీక్షలు చేయడంతో కరోనా పాజిటివ్
  • ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు

ప్రముఖ తమిళ సినీ నటుడు, ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి, తన అభిమానులను మెప్పించి, ఆపై రాజకీయాల్లోకి వచ్చి, డీఎండీకే పేరిట పార్టీని పెట్టిన విజయ కాంత్‌ కు కరోనా మహమ్మారి సోకింది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

విజయకాంత్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా, తాజాగా కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. మరోపక్క, తమ అభిమాన హీరోకు కరోనా సోకడంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విజయకాంత్ ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనగా, ఆ సమయంలోనే వైరస్ ఎవరి నుంచో అంటుకున్నట్టు తెలుస్తోంది. విజయకాంత్ త్వరగా కోలుకోవాలని తమిళనాడు వ్యాప్తంగా ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి.