ONGC: గుజరాత్‌లోని ఓఎన్‌జీసీ ప్లాంటులో భారీ అగ్నిప్రమాదం

fire breaks out in the Hazira Gas processing plant
  • ఈ తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ప్రమాదం
  • 10 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిన పేలుడు శబ్దాలు
  • మంటలను అదుపుచేస్తున్న సిబ్బంది
గుజరాత్‌లోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ప్లాంట్‌లో ఈ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సూరత్‌లోని హజీరా ఆధారిత ఓఎన్‌జీసీ ప్లాంట్‌లో రెండు టెర్మినళ్ల వద్ద తెల్లవారుజామున 3.30 గంటలకు భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు శబ్దం దాదాపు 10 కిలోమీటర్ల దూరం వరకు వినిపించినట్టు స్థానికులు తెలిపారు.

ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది చెలరేగుతున్న మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.
ONGC
Gujarat
surat
Fire Accident

More Telugu News