అసోంలో భయపెడుతున్న ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ .. 12 వేల పందులను చంపేయాలని ప్రభుత్వం ఆదేశం
- 14 జిల్లాల్లో వ్యాప్తి చెందిన ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ
- ఇప్పటి వరకు 18 వేలకుపైగా వరాహాల మృత్యువాత
- పందుల యజమానులకు పరిహారం
అధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా, నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పందులను వధించాలని, దుర్గాపూజ (దసరా)కు ముందే ఈ పని పూర్తిచేయాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. 14 జిల్లాల్లోని 30 ఎపిసెంటర్లలో కిలోమీటర్ పరిధిలో వరాహాలను వధించనున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వెంటనే డ్రైవ్ ప్రారంభించనున్నట్టు చెప్పారు. పరిహారాన్ని వాటి యజమానుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపారు.