సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

24-09-2020 Thu 07:27
Pooja Hegde plays as standup commedian
  • కామెడీ కురిపించే పాత్రలో పూజ హెగ్డే 
  • దేవా కట్టా దర్శకత్వంలో సాయితేజ్
  • ఊర్వశి రౌటేలా 'బ్లాక్ రోజ్' షూటింగ్ పూర్తి  

*  అందాలతార పూజ హెగ్డే తాజాగా స్టాండప్ కమేడియన్ గా నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా రూపొందుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంలో కథానాయిక పూజ ఇలా స్టాండప్ కమేడియన్ గా హాస్యాన్ని కురిపించనుంది.
*  సాయితేజ్ హీరోగా నటించే 14వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రానికి దేవా కట్టా దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, అక్టోబర్ ద్వితీయార్థం నుంచి షూటింగ్ జరుగుతుందని దేవా కట్టా తెలిపారు.
*  బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా ప్రధానపాత్రధారిగా తెలుగులో రూపొందుతున్న 'బ్లాక్ రోజ్' చిత్రం షూటింగ్ పూర్తయింది. ఆగస్టు 17న ప్రారంభమైన షూటింగును సింగిల్ షెద్యూలులో పూర్తిచేశారు. నూతన దర్శకుడు మోహన్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సంపత్ నంది స్క్రిప్టును సమకూర్చారు.