తిరుమల ఆచారాన్ని కాలరాసే హక్కు మీకెక్కడిది?: దేవినేని

23-09-2020 Wed 22:01
Devineni Uma fires on YS Jagan Over Tiruma row
  • జగన్‌కు ఉమ సూటి ప్రశ్న
  • మంత్రుల వ్యాఖ్యలు, జగన్ తీరుతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న దేవినేని
  • అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్‌పై సంతకం చేశారన్న నేత

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనాదిగా వస్తున్న ఆచారాలను కాలరాసే హక్కును మీకెవరు ఇచ్చారని ప్రశ్నించారు. డిక్లరేషన్ ఫామ్‌ను నింపడానికి ఎవరికీ లేని అభ్యంతరం మీకెందుకని నిలదీశారు.

 ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మీరే ఆచారాన్ని ధిక్కరించి దరఖాస్తును నింపనంటే ఎలా అని మండిపడ్డారు. జగన్ డిక్లరేషన్‌పై సంతకం చేసి సతీసమేతంగా వెళ్లి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాలని భక్తులు కోరినట్టు చెప్పారు. మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు, జగన్ తీరుతో భక్తుల మనసులు తీవ్రంగా గాయపడ్డాయన్నారు. శ్రీవారిని దర్శించుకున్నప్పుడు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ చేసి స్వామి వారిపై తనకున్న భక్తిభావాన్ని చాటారని ఉమ గుర్తు చేశారు.