శారీరకంగా హింసిస్తున్నాడు.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి పూనమ్ పాండే

23-09-2020 Wed 19:38
Actor Poonam Pandeys husband Sam Bombay gets bail
  • జులైలో నిశ్చితార్థం, ఈ నెల 10న వివాహం
  • విహారయాత్రలో ఉండగానే భర్తపై ఫిర్యాదు
  • అరెస్ట్ చేసి బెయిలుపై విడిచిపెట్టిన గోవా పోలీసులు

వివాహమై రెండు వారాలు కూడా కాకముందే బాలీవుడ్ నటి పూనమ్ పాండే తన భర్త, నిర్మాత శ్యామ్ బాంబేపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా హింసిస్తున్నాడని గోవా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం శ్యామ్‌ను అరెస్ట్ చేయగా, రూ. 20 వేల పూచీకత్తుపై స్థానిక కోర్టు అతడికి బెయిలు మంజూరు చేసింది.

శ్యామ్ బాంబేను తాను వివాహం చేసుకోబోతున్నట్టు ఈ ఏడాది జులైలో పూనమ్ ప్రకటించింది. నిశ్చితార్థం చేసుకున్న ఉంగరాలను చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఈ నెల 10న శ్యామ్‌తో వివాహమైనట్టు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. పెళ్లి ఫొటోలను షేర్ చేసింది. తాజాగా, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి టూర్‌కు కూడా వెళ్లారు. అంతలో ఏమైందో కానీ భర్త తనను హింసిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశమైంది.