అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తప్పిన పెను ప్రమాదం!

23-09-2020 Wed 17:32
International space station moves to avoid collision with debris
  • స్పేస్ స్టేషన్ కక్ష్యలోకి దూసుకొచ్చిన రాకెట్ శకలం 
  • అంతరిక్ష కేంద్రాన్ని దూరం జరిపిన ఫ్లయిట్ కంట్రోలర్లు
  • 1.40 కి.మీ దూరం నుంచి వెళ్లిపోయిన శకలం 

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్పేస్ స్టేషన్ దిశగా అంతరిక్ష శకలం దూసుకొస్తున్న నేపథ్యంలో స్పేస్ స్టేషన్ లోని రష్యా, అమెరికా ఫ్లయిట్ కంట్రోలర్లు దాన్ని భూకక్ష్య నుంచి స్పల్పంగా దూరం జరిపారు. దీంతో, శకలం దానికి సుమారు 1.40 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లిపోయింది.

2018లో జపాన్ ప్రయోగించిన రాకెట్ సుమారు 77 ముక్కలైంది. దానికి సంబంధించిన ఓ శకలం ఇప్పుడు స్పేస్ స్టేషన్ కక్ష్యలోకి వచ్చింది. దాని నుంచి తప్పించేందుకు వ్యోమగాములు ఈ విన్యాసాన్ని చేపట్టారు.

అంతరిక్ష కేంద్రం గంటకు 17 వేల కిలోమీటర్ల వేగంతో పరిభ్రమిస్తుంటుంది. దానికి ఒక చిన్న వస్తువు తగిలినా పెను ప్రమాదం సంభవిస్తుంది. అయితే ఇలాంటివి సర్వసాధారణమని నాసా చీఫ్ తెలిపారు. 1999 నుంచి 2018 వరకు ఇలాంటి విన్యాసాలను 25 సార్లు నిర్వహించినట్టు వెల్లడించారు.