Saudi Arabia: భారత్ నుంచి విమాన రాకపోకలపై నిషేధం విధించిన సౌదీ అరేబియా

Saudi Arabia suspends travel to and from India
  • భారత్ లో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు
  • కరోనా కట్టడిలో భాగంగా కీలక నిర్ణయం
  • భారత్ తో పాటు బ్రెజిల్, అర్జెంటీనాలపై నిషేధం

భారత్ నుంచి విమాన రాకపోకలపై సౌదీ అరేబియా తాత్కాలిక నిషేధం విధించింది. భారత్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో సౌదీ ఈ నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో కరోనాను కట్టడి చేయడంలో భాగంగా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కారణంతో బ్రెజిల్, అర్జెంటీనా విమాన రాకపోకలను కూడా నిషేధించింది. ఈ దేశాల నుంచి వచ్చే సాధారణ ప్రయాణికులపై నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. అయితే, అధికారిక కార్యకలాపాలపై వచ్చేవారి ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని చెప్పింది.

  • Loading...

More Telugu News