un: కశ్మీర్‌పై టర్కీ అధ్యక్షుడి అభ్యంతరకర వ్యాఖ్యలు.. దీటుగా బదులిచ్చిన భారత్‌

Turkish Presidents remarks on JK at UNGA
  • ఐక్యరాజ్యసమితి సమావేశంలో మాట్లాడిన ఎర్డోగన్
  • కశ్మీర్‌ వివాదాన్ని ఐరాస నిబంధనల ప్రకారం పరిష్కరించాలని వ్యాఖ్య
  • తీవ్రంగా పరిగణించిన భారత్‌
  • అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆగ్రహం

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. వీడియో రూపంలో ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్‌ వివాదాన్ని ఐరాస నిబంధనల ప్రకారం పరిష్కరించాలని చెప్పుకొచ్చారు. గత ఏడాది జరిగిన సమావేశంలోనూ ఆయన ఇదే అంశంపై వ్యాఖ్యానించి భారత్‌ నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆయన తీరు మారలేదు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై భారత్‌ దీటుగా సమాధానం ఇచ్చింది.  

ఐరాస భారత ప్రతినిధి తిరుమూర్తి ఈ విషయంపై స్పందిస్తూ... భారత కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌ గురించి ఎర్డోగన్ మాట్లాడడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని తెలిపారు. ఈ తీరును భారత్‌ ఏ మాత్రమూ అంగీకరించబోదని చెప్పారు.  దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం టర్కీ నేర్చుకోవాలని ఆయన తెలిపారు. కాగా, పాక్‌ కూడా కశ్మీర్ గురించి ప్రస్తావించగా భారత్‌ తిప్పికొట్టిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News