Priyanka: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Priyanka Arul Mohan opposite Sharwanand again
  • శర్వానంద్ కి జోడీగా మరోసారి ప్రియాంక 
  • థియేటర్లలోనే రానా 'విరాటపర్వం'!
  • రేణు దేశాయ్ వెబ్ సీరీస్ పేరు 'ఆద్య'    
*  ప్రస్తుతం 'శ్రీకారం' చిత్రంలో శర్వానంద్ సరసన కథానాయికగా నటిస్తున్న ప్రియాంక అరుళ్ మోహన్ మరోసారి శర్వాకు జోడీగా నటించే అవకాశం కనిపిస్తోంది. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందే 'మహాసముద్రం' చిత్రంలో శర్వానంద్ పక్కన హీరోయిన్ పాత్రకు ప్రియాంకను తీసుకుంటున్నట్టు సమాచారం.
*  రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న 'విరాటపర్వం' చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కి ముందు చాలావరకు పూర్తయింది. త్వరలో తదుపరి షూటింగును నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్మాతలు అనుకుంటున్నట్టు వస్తున్న వార్తలలో వాస్తవం లేదని, థియేటర్లలోనే చిత్రాన్ని రిలీజ్ చేస్తారని యూనిట్ వర్గాలు తెలిపాయి.  
*  చాలా రోజుల తర్వాత రేణు దేశాయ్ ఓ వెబ్ సీరీస్ ద్వారా మళ్లీ కెమేరా ముందుకు వస్తున్నారు. కృష్ణ మామిడాల దర్శకత్వంలో రూపొందే ఈ వెబ్ సీరీస్ కి 'ఆద్య' అనే పేరు నిర్ణయించారు. రేణు దేశాయ్ కూతురు పేరు కూడా ఆద్య అన్న సంగతి విదితమే. కాగా, ఇందులో ఆమె ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈఓ గా నటిస్తున్నారు.
Priyanka
Sharwanand
Rana Daggubati
Sai Pallavi
Renu Deshai

More Telugu News