క్షమించండి.. ఈ నాలాలు ఎప్పటి నుంచో ఉన్న దరిద్రం: తలసాని

22-09-2020 Tue 20:58
Officers are responsible for Sumedhas death says Talasani
  • చిన్నారి సుమేధ మృతి బాధాకరం
  • ఆమె తల్లిదండ్రులకు క్షమాపణ చెపుతున్నాం
  • అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం

హైదరాబాద్ నేరేడ్ మెట్ ప్రాంతంలోని నాలాలో పడి చిన్నారి సుమేధ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అందరినీ కలచి వేస్తోంది. నాలాలను జీహెచ్ఎంసీ సరిగా నిర్వహించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని అన్నారు. ఈ నాలాలు ఎప్పటి నుంచో ఉన్న దరిద్రమని చెప్పారు. సుమేధ మృతి బాధాకరమని, ఆమె తల్లిదండ్రులకు క్షమాపణ చెపుతున్నామని అన్నారు. మరోవైపు తమ కూతురు మరణించిన ఘటనలో మంత్రి కేటీఆర్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ లపై సుమేధ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.