ఏపీలో దళితులపై దాడుల పట్ల కేంద్రమంత్రికి ఫిర్యాదు చేసిన టీడీపీ ఎంపీలు

22-09-2020 Tue 20:55
TDP Parliament members union minister Thawarchand Gehlot
  • కేంద్ర సామాజిక న్యాయ మంత్రి గెహ్లాట్ కు విజ్ఞాపన
  • వెంటనే జోక్యం చేసుకోవాలన్న టీడీపీ ఎంపీలు
  • దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని వినతి

ఏపీలో దళితులపై జరుగుతున్న దాడుల గురించి కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ కు టీడీపీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ ఫిర్యాదు చేశారు. ఈ రోజు ఢిల్లీలో వారు కేంద్ర మంత్రిని కలిశారు. 

రాష్ట్రంలో దళితులపై వరుసగా జరుగుతున్న దాడుల గురించి ఆయనకు వివరించారు. ఈ మేరకు మంత్రికి ఓ విజ్ఞాపన పత్రం అందించారు. ఏపీలో దళితుల పరిస్థితి సంక్షుభితంగా ఉందని, వెంటనే జోక్యం చేసుకుని దళితుల జీవితాలను కాపాడడంతోపాటు వారి ఆత్మగౌరవాన్ని నిలపాలంటూ టీడీపీ ఎంపీలు కేంద్రమంత్రి గెహ్లాట్ కు విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి తన చర్యల ద్వారా దళితుల్లో చట్టబద్ధ పాలన పట్ల తిరిగి విశ్వాసం కల్పించాలని కోరారు.