పోలీసుల తీరును నిరసిస్తూ.. ఆత్మహత్యాయత్నం చేసిన దర్శకుడు కొరటాల శివ అసిస్టెంట్!

22-09-2020 Tue 19:37
Koratala Siva assistant attempts suicide
  • మడకశిర పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం
  • పోలీసుల వల్ల తన పెళ్లి ఆగిపోయిందని ఆరోపణ
  • మహేశ్ ను అడ్డుకున్న పోలీసులు

టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ దగ్గర అసిస్టెంట్ రైటర్ గా పని చేస్తున్న మహేశ్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. మహేశ్ ది అనంతపురం జిల్లా మడకశిర మండలం చీపులేటి గ్రామం. తన అన్నను ఈ నెల 8వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారని... కర్ణాటక నుంచి అక్రమ మద్యం తీసుకొస్తున్నాడని ఇంటికి వచ్చి దారుణంగా ప్రవర్తించారని మహేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు వ్యవహరించిన తీరుతో తన పెళ్లి ఆగిపోయిందంటూ మడకశిర పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. అప్రమత్తమైన పోలీసులు మహేశ్ ను అడ్డుకున్నారు.