ఐపీఎల్ 2020: టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్

22-09-2020 Tue 19:30
Chennai Super Kings won the toss against Rajasthan Royals
  • నేడు రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్
  • మరో విజయం కోసం చెన్నై తహతహ
  • స్టీవ్ స్మిత్ సేనకు ఈ ఐపీఎల్ లో తొలిపోరు

ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ లో తన రెండో మ్యాచ్ కు సిద్ధమైంది. యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 13వ సీజన్ లో ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ పోరులో టాస్ గెలిచిన చెన్నై జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ పై విజయం సాధించిన చెన్నై జట్టు అదే ఊపును కొనసాగించాలని భావిస్తోంది.

ఇక, స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడుతోంది. ఆ జట్టులో అందరి కళ్లు ఇంగ్లాండ్ స్పీడ్ స్టర్ జోఫ్రా ఆర్చర్ పై ఉంటాయనడంలో సందేహంలేదు. తిరుగులేని పేస్ తో ఫార్మాట్ ఏదైనా బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తిస్తున్న ఈ క్విక్ బౌలర్ రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక ఆటగాడు.