Apple: కరోనా అంతమైనా కొన్ని కొత్త అలవాట్లు మనతోనే ఉంటాయి: యాపిల్ సీఈవో టిమ్ కుక్

  • కరోనా వల్ల ఉద్యోగులు ఆఫీసుకు దూరంగా ఉన్నారు
  • అయినా అనుకున్న సమయానికి అన్నింటినీ లాంచ్ చేస్తున్నాం
  • ప్రస్తుతం 15 శాతం మంది ఉద్యోగులు ఆఫీసుకు వస్తున్నారు
Impressed by Remote work says Apple CEO Tim Cook

కరోనా సంక్షోభ సమయంలో కార్యాలయాలకు దూరంగా ఉంటూనే తమ ఉద్యోగులు విధులు నిర్వహించిన విధానాన్ని యాపిల్ సీఈవో టిమ్ కుక్ ప్రశంసించారు. తమ ఉద్యోగుల పని తీరు ఎంతో ఆకట్టుకుందని చెప్పారు. కరోనా అంతమైన తర్వాత కూడా కొన్ని కొత్త అలవాట్లు మనతో పాటు ఉండిపోతాయని తెలిపారు.

'ది అట్లాంటిక్ ఫెస్టివల్' వద్ద ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కరోనా వల్ల ఎక్కువ మంది ఉద్యోగులు దూరం నుంచి పని చేస్తున్నప్పటికీ... ఈ ఏడాది అనుకున్న సమయానికే కొత్త యాపిల్ వాచ్ లు, ఐపాడ్స్ ను లాంచ్ చేస్తున్నామని టిమ్ కుక్ తెలిపారు.

ఇప్పటికే 10 నుంచి 15 శాతం మంది యాపిల్ ఉద్యోగులు ఆఫీసుకు వస్తున్నారని... వచ్చే ఏడాది ఏదో ఒక సమయానికి సిలికాన్ వ్యాలీలోని కొత్త క్యాంపస్ కు స్టాఫ్ మొత్తం వస్తారని భావిస్తున్నానని చెప్పారు. వారంలో తాను వివిధ సమయాల్లో ఆఫీసుకు వెళ్తుంటానని తెలిపారు. ఉద్యోగులంతా ఒకేచోట కలసి పనిచేయడానికి, రిమోట్ గా పని చేయడానికి తేడా ఉందనే విషయాన్ని తాను గ్రహించానని చెప్పారు. ఆఫీసులో కూర్చొని పని చేస్తే క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుందని అన్నారు.

More Telugu News