'ఆర్ఆర్ఆర్' కోసం డేట్స్ కేటాయించిన అలియాభట్!

22-09-2020 Tue 16:23
Alia Bhat gives dates for RRR movie
  • లాక్ డౌన్ కారణంగా షూటింగుకి బ్రేక్ 
  • సమస్యగా మారిన హీరోయిన్ల డేట్స్
  • నవంబర్ నుంచి డేట్స్ ఇచ్చిన అలియా
  • ముందుగా అలియా కాంబో సీన్స్ చిత్రీకరణ

రాజమౌళి సినిమా అంటేనే భారీ తారాగణంతో కూడిన భారీ చిత్రమవుతుంది. చాలా రోజుల షూటింగు వుంటుంది. ఎన్నో లొకేషన్లలో చిత్రీకరణ చేయాల్సివుంటుంది. దానికితోడు గత ఆరు నెలల నుంచి లాక్ డౌన్ తో షూటింగుకి అంతరాయం కలగడంతో 'ఆర్ఆర్ఆర్' సినిమా నిర్మాణానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది.  

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వాస్తవానికి ఎప్పుడో పూర్తవ్వాలి. అయితే, లాక్ డౌన్ వల్ల షెడ్యూల్స్ అన్నీ అప్సెట్ అయ్యాయి. హీరోలు ఎప్పుడు కావాలంటే అప్పుడు డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పటికీ, హీరోయిన్ల డేట్స్ సమస్యగా వుందట.

ముఖ్యంగా ఇందులో చరణ్ సరసన కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ భామ అలియాభట్ డేట్స్ పెద్ద సమస్య అయ్యాయట. ఆమె బాలీవుడ్ లో పలు చిత్రాలు చేస్తూ బిజీగా వుండడం వల్ల, లాక్ డౌన్ కారణంగా అన్ని షూటింగులూ నిలిచిపోవడంతో ఇప్పుడు అన్నిటికీ ఆమె మళ్లీ ఒక పద్ధతిలో డేట్స్ సర్దుబాటు చేయాల్సివుంది. ఈ క్రమంలో నవంబర్ నుంచి ఏకబిగిన ఆమె 'ఆర్ఆర్ఆర్'కు డేట్స్ కేటాయించినట్టు తెలుస్తోంది.

దీంతో నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించి ముందుగా అలియా భట్ కాంబినేషన్లో వున్న సన్నివేశాల చిత్రీకరణని పూర్తిచేయాలని రాజమౌళి నిర్ణయించినట్టు సమాచారం.