దేశంలో 55 లక్షలు దాటిన కరోనా కేసులు

22-09-2020 Tue 10:49
COVID19 case tally crosses 55 lakh mark with a spike of 75083 new cases
  • గత 24 గంటల్లోే 75,083 మందికి కరోనా నిర్ధారణ
  • మృతుల సంఖ్య మొత్తం 88,935
  • కోలుకున్న వారు 44,97,868 మంది

భారత్‌లో కొవిడ్‌-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 75,083 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 55,62,664కు చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 1,053 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 88,935కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 44,97,868 మంది కోలుకున్నారు. 9,75,861 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
                      
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 6,53,25,779 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 9,33,185 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.