మావోయిస్టుల ఆవిర్భావ వారోత్సవాలు.. విశాఖ మన్యంలో ఉద్రిక్తత

22-09-2020 Tue 10:30
Police High alert in Visakha
  • మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో పోలీసుల హై అలెర్ట్ 
  • ఉనికి కోసం దాడులకు పాల్పడే అవకాశం ఉందని సమాచారం
  • మన్యంలో అణువణువు గాలిస్తున్న పోలీసులు

మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో తమ ఉనికిని చాటుకునేందుకు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టు యాక్షన్ టీములు కూడా సంచరిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగారు. అరకు, పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టులలో సోదాలు నిర్వహించారు. ప్రతీ ఇంటిని క్షుణ్ణంగా గాలించారు. మరికొన్ని ప్రాంతాల్లో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. దీంతో మన్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.