Maharashtra: భవనం కుప్పకూలిన ఘటనలో 17కు చేరిన మృతుల సంఖ్య

  • నిన్న తెల్లవారుజామున కుప్పకూలిన భవనం
  • రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
  • రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిన ఉద్ధవ్ ప్రభుత్వం
death toll climbs 20 in Bhiwandi building collapse

మహారాష్ట్రలోని భీవండిలో నిన్న తెల్లవారుజామున మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 17కు చేరింది. ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఇప్పటి వరకు 20 మందిని శిథిలాల నుంచి రక్షించాయి. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధిత కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ట్వీట్ చేయగా, ఇది విచారకరమని, బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు, బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున సాయం అందించనున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. భవనం శిథిలావస్థకు చేరుకోవడం వల్లే కుప్పకూలినట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

More Telugu News