గురకపెట్టే వారికి కరోనా ముప్పు మూడు రెట్లు అధికం!

22-09-2020 Tue 09:51
snorers are more risk than others from corona
  • సాధారణ రోగులతో పోలిస్తే ప్రాణాలకు ముప్పు అధికం
  • శ్వాసనాళంలోకి కొన్ని క్షణాలపాటు ఆగిపోయే గాలి
  • వార్‌విక్ అధ్యయనంలో వెల్లడి

సాధారణ రోగులతో పోలిస్తే గురకపెట్టే కరోనా రోగుల ప్రాణాలకు మూడు రెట్లు అధిక ముప్పు ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. గురకపెట్టి నిద్రించే వారి కండరాలు విశ్రాంతి తీసుకునే సమయంలో శ్వాసనాళంలోకి తాత్కాలికంగా కొన్ని క్షణాలపాటు గాలి సరిగా పోదని, ఫలితంగా ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని వార్‌విక్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. కరోనా వైరస్‌కు, నిద్రకు ఉన్న సంబంధంపై ఇప్పటి వరకు జరిగిన 18 అధ్యయనాలను పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించింది.

అయితే, గుర్రుపెట్టే వారిలో స్థూలకాయం, రక్తపోటు, మధుమేహం ఉన్నట్టయితే వారికి కరోనా సోకినప్పటికీ అది వారికి అదనపు రిస్క్ ఫ్యాక్టర్ కాబోదని పరిశోధకులు స్పష్టం చేశారు. ఆ మూడే వారికి రిస్క్ ఫ్యాక్టర్స్ అవుతాయన్నారు. నిజానికి ఈ మూడు సమస్యలు ఉన్న వారిలో గురక కూడా దానంతట అదే వస్తుందని పేర్కొన్నారు.