రెండు బైకులు ఢీ...నిండు గర్భిణి దుర్మరణం!

22-09-2020 Tue 08:59
  • నిజామాబాద్ జిల్లాలో ఘటన
  • సోదరుడితో కలిసి ఆసుపత్రికి వెళుతున్న రజిత
  • మరో బైక్ ఢీకొనడంతో ప్రమాదం
Pregnent Lady Died in Road Accident
వేగంగా వెళుతున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో నిండు గర్భిణి దుర్మరణం చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తీర్మనపల్లి వద్ద జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, 8 నెలల గర్భంతో ఉన్న రజిత అనే మహిళ, తన సోదరుడితో కలిసి వైద్య పరీక్షల నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి వెళుతుండగా, ఈ ఘటన జరిగింది. ఎదురుగా వస్తున్న మరో బైక్ రజిత ప్రయాణిస్తున్న బైక్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైకులు నడుపుతున్న ఇద్దరు యువకులకు గాయాలు అయ్యాయి. రజిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, గాయపడిన ఇద్దరికీ చికిత్స జరుగుతోందని, కేసును విచారిస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి.