Andhra Pradesh: పూజల కోసమని వచ్చి.. కృష్ణానదిలో దూకిన ఎన్ఎంయూ ఏపీ ఉపాధ్యక్షుడు

NMU AP Vice President Durgaprasad Jumped into Krishna River
  • కుటుంబ సభ్యులతో కలిసి తాడేపల్లి బ్రిడ్జి వద్దకు
  • వీడియో తీయాలని కోరిన దుర్గాప్రసాద్
  • గల్లంతైన దుర్గాప్రసాద్ కోసం గాలింపు
నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మన్నే దుర్గాప్రసాద్ (65) నిన్న కృష్ణా నదిలో దూకి గల్లంతయ్యారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి అయిన దుర్గాప్రసాద్ కృష్ణా నదికి పూజలు చేసేందుకు బంధువులతో కలిసి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. పూజలు చేస్తున్న సమయంలో వీడియో తీయాలంటూ ఆయన తమ్ముడి కుమారుడు సుహిత్‌ను కోరారు. అతడు వీడియో తీస్తున్న సమయంలో దుర్గాప్రసాద్ ఒక్కసారిగా నదిలోకి దూకారు. దీంతో షాకైన సుహిత్, ఇతర కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. గల్లంతైన దుర్గాప్రసాద్‌ కోసం గాలింపు మొదలుపెట్టారు.
Andhra Pradesh
Tadepalli
NMU
Krishna River

More Telugu News