సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

22-09-2020 Tue 07:23
Rakul joins Krish sets again
  • మళ్లీ షూటింగులో పాల్గొంటున్న రకుల్ 
  • పెరుగుతున్న నాని సినిమా బడ్జెట్
  • మల్టీ స్టారర్ లో నటిస్తున్న విశాల్

*  బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంతో తన పేరును ముడిపెట్టి మీడియాలో వస్తున్న కథనాలను నిలుపుదల చేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి, ఊరట పొందిన కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ హైదరాబాదు తిరిగి వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం షూటింగులో పాల్గొంటోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో జరుగుతోంది.
*  నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' పేరిట ఓ చిత్రం రూపొందనుంది. కోల్ కతా నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగడం వల్ల అక్కడికి వెళ్లి షూటింగ్ చేయాలని మొదట్లో భావించారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల కారణంగా హైదరాబాదులోనే పాత కోల్ కతా వాతావరణాన్ని ప్రతిబింబించే సెట్స్ ను భారీగా వేస్తున్నారు. దీని వల్ల బడ్జెట్ భారీగా పెరుగుతోందని తెలుస్తోంది.
*  తమిళ కథానాయకుడు విశాల్ త్వరలో తన స్నేహితుడు ఆర్యతో కలసి ఓ మల్టీ స్టారర్ చేయనున్నాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి జరుగుతుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తారు.