వరదల్లో చిక్కుకున్న సీఆర్పీఎఫ్ బస్సు.. జవాన్లకు తప్పిన ముప్పు!

21-09-2020 Mon 20:31
Bus with 30 CRPF soldiers washed up in floods
  • ఛత్తీస్ గఢ్, మల్కన్ గిరి బీజాపూర్ ప్రాంతంలో ఘటన  
  • అడవుల్లో కూంబింగ్ కు వెళ్లిన జవాన్లు 
  • వరద నీటికి కొట్టుకుపోయి, ఒరిగిపోయిన బస్సు

ఛత్తీస్ గఢ్ లో పెను ప్రమాదం తప్పింది. మల్కన్ గిరి బీజాపూర్ ప్రాంతంలోని అడవుల్లో మావోయిస్టుల కోసం కూంబింగ్ కు వెళ్లిన సీఆర్పీఎఫ్ బస్సు వరద నీటిలో కొంత దూరం కొట్టుకుపోయింది. ఓ వాగు మీద నుంచి బస్సు ప్రయాణిస్తుండగా వరద ఉద్ధృతికి బస్సు నీటిలోకి ఒరిగిపోయింది.

ప్రమాద సమయంలో బస్సులో 30 మంది జవాన్లు ఉన్నారు. అయితే వారంతా సురక్షితంగా బయటపడ్డారు. వరద ప్రవాహాన్ని అంచనా వేయడంలో తప్పు జరగడంతో ప్రమాదం జరిగింది. అయితే, జవాన్లందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.