ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాకు సంబంధించి అప్ డేట్!

21-09-2020 Mon 20:17
South Indian young hero to play Lakshman role in Prabhas movie Adipurush
  • భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'ఆదిపురుష్'
  • ప్రభాస్ సరసన నటిస్తున్న దీపికా పదుకొణే 
  • లక్ష్మణుడి పాత్రలో దక్షిణాదికి చెందిన యువ హీరో

ప్రభాస్ నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తుండగా... ప్రభాస్ సరసన దీపికా పదుకొణే నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడు పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త వినిపిస్తోంది. రాముడి తమ్ముడైన లక్ష్మణుడి పాత్రలో దక్షిణాదికి చెందిన ఓ యువ నటుడు నటిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆ ఛాన్స్ ఎవరికి దక్కిందా? అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. ఈ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం.