ఆంజనేయస్వామి విగ్రహం కాళ్లకు మొక్కి.. ఆ తర్వాత హుండీ దోచేశారు!

21-09-2020 Mon 20:00
Thieves robbed Hundi after taking Hanuman blessings
  • మండపేటలో హుండీని దోచుకున్న దొంగలు
  • చోరీకి పాల్పడ్డ ముగ్గురు యువకులు
  • సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు

దేవుడి కాళ్లకు మొక్కి ఆయన హుండీనే  కొల్లగొట్టిన ఘటన తూర్పుగోదావరి జిల్లా మండపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే స్థానికంగా ఉన్న ఒక ఆంజనేయస్వామి విగ్రహం వద్ద నిన్న అర్ధరాత్రి చోరీ జరిగింది.

బైక్ మీద వచ్చిన ముగ్గురు యువకులు ఆంజనేయస్వామి కాళ్లకు మొక్కారు. అనంతరం అక్కడున్న హుండీని బద్దలు కొట్టి, అందులోని సొమ్మును దోచుకుపోయారు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు వీడియో ఫుటేజీని పరిశీలించారు. ఈ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు, గుడిలో ఉన్న హుండీని దోచుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.