ఏపీ కరోనా అప్ డేట్స్: 51 మరణాలు, 6,235 పాజిటివ్ కేసులు

21-09-2020 Mon 17:52
Corona virus spreading slowdowns gradually in AP
  • ఏపీలో తగ్గుతున్న వైరస్ ప్రభావం
  • తాజాగా 10,502 మందికి కరోనా నయం
  • చికిత్స పొందుతున్న 74,518 మంది

ఏపీలో కరోనా ఉద్ధృతి కాస్తంత నిదానించినట్టే కనిపిస్తోంది. గడచిన కొన్నిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.  తాజా మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగించేలా లేదు. గడచిన 24 గంటల్లో ఏపీలో 51 మంది కరోనాతో మరణించగా, 6,235 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో మాత్రమే వెయ్యికి పైగా కేసులు వచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,31,749కి పెరిగింది. మరణాల సంఖ్య 5,410కి చేరింది.

తాజాగా 10,502 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఓవరాల్ గా ఇప్పటివరకు 5,51,821 మంది ఈ వైరస్ మహమ్మారి నుంచి విముక్తులయ్యారు. ఇంకా 74,518 మంది చికిత్స పొందుతున్నారు.