పక్షిని భోంచేసిన రాకాసి సాలీడు... వీడియో ఇదిగో!

21-09-2020 Mon 16:52
Giant spider eating a bird as video went viral
  • వీడియో వైరల్
  • సాలీడు చేతచిక్కి అచేతనంగా మారిన పక్షి
  • నిదానంగా ఆరగించిన సాలీడు

కొన్ని రకాల సాలీడు పురుగులు ఎంతో విషపూరితం అని తెలిసిందే. కొన్ని రకాల సాలీళ్లు ఆకారంలో చాలా పెద్దవిగా ఉంటాయి. ఇవి కూడా ప్రమాదకరమైనవే. అయితే పింక్ టో టరంటులా అని పిలిచే ఓ రాకాసి సాలీడు చిన్న పక్షిని తింటున్న వీడియో ఇప్పుడు నెట్టింట ఎక్కువగా కనిపిస్తోంది.

తన కాటుతో పక్షి అచేతనంగా మారిపోగా, ఆ పక్షిని తన ముందరి కాళ్లతో పట్టుకుని తింటున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. ఓ కొయ్య దూలానికి వేలాడుతున్న ఈ సాలీడు తన చేత చిక్కిన పక్షిని నిదానంగా భోంచేస్తూ దర్శనమిచ్చింది.

 కాగా, ప్రపంచంలో ఉన్న సాలీడు జాతుల్లో పిక్ టో టరంటులా అత్యంత పెద్దది అని భావిస్తున్నారు. దీని శాస్త్రీయ నామం అవిక్యులేరియా అవిక్యులేరియా. ఇవి ఎక్కువగా కోస్టారికా, బ్రెజిల్, దక్షిణ కరీబియన్ దేశాల్లో కనిపిస్తాయి.