Kumudini: నేవీ చరిత్రపుటల్లోకి ఎక్కబోతున్న కుముదిని, రితి!

  • వార్ షిప్ లో పనిచేయనున్న మహిళా అధికారులు
  • ఇప్పటి వరకు యుద్ధనౌకల్లో మహిళలకు లభించని అవకాశం
  • హెలికాప్టర్లను ఆపరేట్ చేయనున్న కుముదిని, రితి
2 women to  be posted on Indian Navy Warship

లింగ బేధాన్ని తొలగించే దిశగా ఇండియన్ నేవీ కీలక అడుగు వేసింది. యుద్ధనౌకలో పురుష సిబ్బందితో పాటు కలిసి పని చేసే అవకాశాన్ని మహిళా సిబ్బందికి  కూడా కల్పించింది. సబ్ లెఫ్టినెంట్ కుముదిని త్యాగి, సబ్ లెఫ్టినెంట్ రితి సింగ్ లకు వార్ షిప్ లో పని చేసే అవకాశం కల్పించింది. ఈ  క్రమంలో యుద్ధనౌకలో పని చేసిన తొలి మహిళలుగా వీరిద్దరూ చరిత్రపుటల్లోకి ఎక్కనున్నారు.

నేవీలో పలువురు మహిళలు వివిధ హోదాల్లో పని చేస్తున్నప్పటికీ... వివిధ కారణాల వల్ల యుద్ధనౌకల్లో పని చేసే అవకాశం వారికి కల్పించలేదు. వార్ షిప్స్ లో రోజుల పాటు ఉండాల్సి ఉంటుంది. షిప్ లో ఉండే క్రూ క్వార్టర్స్ లో ప్రైవసీ లేకపోవడం, మహిళల అవసరాలకు తగ్గట్టుగా ప్రత్యేక బాత్రూమ్ లు లేకపోవడం వంటి పలు సమస్యలు ఇందులో ఉన్నాయి.

నేవీలోని మల్టీరోల్ హెలికాప్టర్ల సెన్సార్లను ఆపరేట్ చేయడంలో వీరిద్దరూ శిక్షణ పొందారు. ఎంహెచ్-60ఆర్ హెలికాప్టర్లను నడిపే బాధ్యతలను వీరికి అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 24 హెలికాప్టర్లకు ఇండియన్ నేవీ ఆర్డర్ ఇచ్చింది. ప్రపంచంలోని అడ్వాన్స్ డ్ హెలికాప్టర్లలో ఒకటిగా ఇవి పేరుగాంచాయి. శత్రు దేశాల నౌకలు, జలాంతర్గాములను గుర్తించే సామర్థ్యం వీటికి ఉంటుంది. వీటికి మిస్సైల్స్, టార్పెడోస్ ను కూడా ఫిక్స్ చేయవచ్చు.

More Telugu News