VHP: 151 సీట్లు వచ్చాయని అహంకారమా... ఈసారి 5 సీట్లే!: కొడాలి నానిపై వీహెచ్ పీ నేత లక్ష్మీనారాయణ ఆగ్రహం

  • డిక్లరేషన్ పై కొడాలి నాని వ్యాఖ్యల పట్ల వీహెచ్ పీ అభ్యంతరం
  • హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్
  • డిక్లరేషన్ ఇవ్వడం బ్రిటీష్ కాలం నుంచి ఉందని వెల్లడి
VHP fires on AP Minister Kodali Nani comments over declaration

ఏపీ మంత్రి కొడాలి నాని తిరుమల డిక్లరేషన్ అంశంపై చేసిన వ్యాఖ్యల పట్ల విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మసీదులు, చర్చిలకు లేని డిక్లరేషన్ తిరుమలకు ఎందుకంటూ నాని పేర్కొనడం పట్ల వీహెచ్ పీ తీవ్రంగా స్పందించింది.

151 సీట్లు వచ్చాయన్న అహంకారంతో కొడాలి నాని మాట్లాడుతున్నాడని, ఈ ప్రభుత్వ తీరు ఇలాగే ఉంటే ఈసారి వచ్చేది 5 సీట్లేనని వీహెచ్ పీ నేత లక్ష్మీనారాయణ అన్నారు. కొడాలి నాని హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడం బ్రిటీష్ హయాం నుంచి ఉందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

అటు, అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య జాతీయ కార్యదర్శి ఎంఎల్ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ, తిరుమలలో అన్యమతస్థులు దర్శనానికి వెళితే డిక్లరేషన్ పై సంతకం చేసే సంప్రదాయం వందేళ్ల నుంచి వస్తోందని తెలిపారు.

More Telugu News