White House: వైట్ హౌస్ కు విషం పూసిన లెటర్ పంపింది ఓ మహిళ... అరెస్ట్ చేసిన పోలీసులు!

  • శ్వేతసౌధం చిరునామాతో లెటర్
  • కెనడా సరిహద్దుల్లో ఓ మహిళ అరెస్ట్
  • మరింత లోతుగా విచారిస్తున్నామన్న అధికారులు
Suspected Lady Arrested in White House Poison Letter

అమెరికా అధ్యక్షుడు నివాసమైన శ్వేతసౌధానికి ప్రమాదకర రిసిన్ పూసిన లేఖను పంపిన కేసులో, పోలీసులు ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఈ లెటర్ పంపిందన్న అనుమానంతో ఆమెను న్యూయార్క్ - కెనడా సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నట్టు 'ది అసోసియేటెడ్ ప్రెస్' వెల్లడించింది.  

ఈ కేసులో పోలీసుల అదుపులో ఉన్న మహిళ వివరాలను వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. బుఫాలో సమీపంలోని పీస్ బ్రిడ్జ్ వద్ద యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఈ లేఖపై ఉన్న రసాయనం డెడ్లీ పాయిజన్ రిసిన్ గా నిర్ధారణ అయిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ లెటర్ కెనడా నుంచే వచ్చిందని, ముందుగానే గుర్తించామని, ఈ విషయంలో మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నామని, మొత్తం ఘటనపై బహిరంగ ప్రకటనలు చేసేందుకు ఎవరికీ అనుమతి లేదని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని సదరు అధికారి తెలిపారు.

More Telugu News