Nagarjuna Sagar: ఈ సీజన్ లో మరోసారి నాగార్జున సాగర్ గేట్లు ఓపెన్!

  • సాగర్ కు 1.61 లక్షల క్యూసెక్కుల నీరు
  • 589 అడుగులకు పైగా నీటి నిల్వ
  • వరద మరింతగా పెరిగే అవకాశం
Nagarjuna Sagar 20 Gates Open

కృష్ణానదిలో భారీ వరద ప్రవహిస్తూ ఉండటంతో, ఈ సీజన్ లో మరోసారి నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లను అధికారులు ఎత్తారు. శ్రీశైలం నుంచి 1.61 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వస్తుండటం, ఇప్పటికే నాగార్జున సాగర్ పూర్తిగా నిండిపోవడంతో 20 గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తిన అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి వరద మరింతగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నీరంతా పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ మీదుగా సముద్రంలోకి వెళ్లిపోతోంది. ప్రస్తుతం సాగర్ లో 309.35 టీఎంసీల నీరుందని, 590 అడుగుల నీటిమట్టానికిగాను 589.10 అడుగుల వరకూ నీరుందని అధికారులు వెల్లడించారు.

ఇక, శ్రీశైలం డ్యామ్ 10 గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి, 3 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు వదులుతున్నారు. అన్ని ఎత్తిపోతల పథకాలకూ పూర్తి స్థాయిలో నీటిని వదులుతున్నారు. జలాశయంలో 215 టీఎంసీలకు పైగా నీటిని నిల్వ ఉంచే అవకాశం ఉండగా, ప్రస్తుతం 211 టీఎంసీల నీరు ఉందని, కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం పూర్తిస్థాయిలో పనిచేస్తున్నదని తెలియజేశారు.

More Telugu News