24 ఏళ్ల తరువాత మళ్లీ రాజ్యసభలో కాలుమోపిన దేవెగౌడ!

21-09-2020 Mon 08:41
Devegowda in Rajyasabha After 24 Years
  • 1997 తరువాత రాజ్యసభకు
  • ప్రమాణం చేయించిన వెంకయ్యనాయుడు
  • కన్నడలో ప్రమాణం చేసిన మాజీ ప్రధాని

మాజీ ప్రధాని దేవెగౌడ మరోసారి రాజ్యసభలో కాలుమోపారు. 1996 జూన్ నుంచి 1997 ఏప్రిల్ వరకూ దేశానికి ప్రధానిగా సేవ చేసిన ఆయన, ఆ సమయంలో రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నారు. ఆ తరువాత 24 సంవత్సరాలకు ఇప్పుడు మరోసారి అదే సభకు వెళ్లారు. ఈ సంవత్సరం జూన్ లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి ఆయన ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆ తరువాత కరోనా, లాక్ డౌన్ కారణంగా ఆయన ఒక్కమారు కూడా హస్తినకు వెళ్లలేదు. ప్రస్తుత సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన రాగా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు దేవెగౌడతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం 87 సంవత్సరాల వయసులో ఉన్న దేవెగౌడ, కన్నడ భాషలో ప్రమాణ స్వీకారం చేశారు.