తొలి పులస చిక్కేసింది... రూ. 21 వేలు పెట్టి కొన్న వైసీపీ నేత!

21-09-2020 Mon 08:23
Huge Rate for Pulasa Fish
  • ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే దొరికే చేప
  • తాజాగా వైనతేయ గోదావరిలో లభ్యం
  • భారీ రేటు ఇచ్చిన వైసీపీ నేత కొండల రావు

పులస... ఈ పేరు వింటేనే మాంసాహారుల నోరూరుతుంది. "పుస్తెలు తాకట్టు పెట్టయినా పులస తినాల్సిందే" అన్న నానుడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎంతో ఫేమస్. గోదావరిలో వరద నీరు పారుతున్న సమయంలో మాత్రమే ఈ చేపలు వరదకు ఎదురు ఈదుతూ వచ్చి, మత్స్యకారుల వలలకు చిక్కుతుంటాయి. ఇండియాలో కేవలం గోదావరి జిల్లాల్లో మాత్రమే ఇది లభిస్తుంది.

ఇక, ఈ సీజన్ లో పులస చేప ఒకటి వైనతేయ గోదావరి పాయలో పాశర్లపూడి మత్స్యకారులకు చిక్కింది. దీని బరువు రెండున్నర కిలోల వరకూ ఉండగా, దీన్ని అదే గ్రామానికి చెందిన వైసీపీ నేత, నగర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మల కొండలరావు రూ. 21 వేలు పెట్టి కొనుగోలు చేయడం గమనార్హం.