ముంబైలో ఘోర ప్రమాదం.. మూడంతస్తుల భవనం కూలి 8 మంది దుర్మరణం

21-09-2020 Mon 07:53
8 Dead After Building Collapses In Bhiwandi
  • ఈ తెల్లవారుజామున ఘటన
  • శిథిలాల కింద మరో 25 మంది
  • కొనసాగుతున్న సహాయక చర్యలు

ముంబైలో ఘోర దుర్ఘటన జరిగింది. మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో 8 మంది దుర్మరణం పాలవగా మరో 25 మంది వరకు శిథిలాల కింది చిక్కుకుని పోయి ఉంటారని భావిస్తున్నారు. భీవండిలోని పటేల్ కాంపౌండ్‌ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున 3.40 గంటల సమయంలో జరిగిందీ ఘటన.

 ఈ ఘటనలో 8 మంది చనిపోయారని థానే మునిసిపల్ అధికారులు తెలిపారు. భవనం కూలిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు శిథిలాల నుంచి ఇప్పటి వరకు 25 మందిని రక్షించారు. వీరిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు. మరో 25 మంది వరకు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు  సమాచారం అందుకున్న ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.