Marcus Stoinis: స్టొయినిస్ మెరుపులు... కింగ్స్ ఎలెవన్ లక్ష్యం 158 రన్స్

Stoinis flamboyant innings leads Delhi Capitals to a respectable score
  • దుబాయ్ లో ఐపీఎల్ రెండో మ్యాచ్
  • మొదట బ్యాటింగ్ చేసి 8 వికెట్లకు 157 రన్స్ చేసిన ఢిల్లీ
  • 21 బంతుల్లో 53 పరుగులు చేసిన స్టొయినిస్
ఐపీఎల్ 13వ సీజన్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ కు దుబాయ్ స్టేడియం వేదిక అయింది. టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.

ఢిల్లీ జట్టులో మార్కస్ స్టొయినిస్ ఇన్నింగ్స్ హైలైట్ అని చెప్పాలి. మిడిలార్డర్ లో వచ్చిన ఈ ఆసీస్ ఆల్ రౌండర్ కేవలం 21 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 53 పరుగులు చేశాడు. అంతకుముందు శ్రేయాస్ అయ్యర్ 39, రిషబ్ పంత్ 31 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో షమీ 3, కాట్రెల్ 2 వికెట్లతో రాణించారు.

అనంతరం, 158 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ జట్టు 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 14 పరుగులు సాధించింది. క్రీజులో ఓపెనర్లు రాహుల్, మయాంక్ అగర్వాల్ ఉన్నారు.
Marcus Stoinis
Delhi Capitals
Kings Eleven Punjab
IPL 2020
Dubai

More Telugu News