బ్యాడ్మింటన్ ఆడుతూ సేదదీరిన రకుల్ ప్రీత్

20-09-2020 Sun 18:50
Rakul Preet spotted in Hyderabad while playing Badminton
  • ఇటీవల బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ పేరు
  • క్లీన్ చిట్ ఇచ్చిన ముంబయి పోలీసులు
  • మళ్లీ ఫిట్ నెస్ కార్యక్రమాలతో రకుల్ బిజీ

ఇటీవలే బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో అందాలభామ రకుల్ ప్రీత్ పేరు వినిపించడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తి వెల్లడించిన లిస్టులో రకుల్ ప్రీత్ పేరు లేదని స్వయంగా పోలీసులే చెప్పడంతో అందరిలోనూ సంతోషం వెల్లివిరుస్తోంది. రకుల్ అయితే ఈ విషయంపై అప్పుడెలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది.

ఈ ఘటనలో ఎవరిపైనా ఆరోపణలు చేయని ఈ పంజాబీ ముద్దుగుమ్మ ఎప్పట్లాగానే తన ఫిట్ నెస్ కార్యక్రమాల్లో మునిగి తేలుతోంది. తాజాగా హైదరాబాదులో బ్యాడ్మింటన్ ఆడుతూ దర్శనమిచ్చింది. బాలీవుడ్ డ్రగ్స్ వివాదంలో తన పేరు వినిపించిన తర్వాత ఓ పబ్లిక్ ప్లేసులో రకుల్ కనిపించడం ఇదే ప్రథమం.